Wednesday, April 8, 2026
[t4b-ticker]

డిస్టిక్ జడ్జిని కలిసిన నూతనంగా ఎన్నికైన కోదాడ బార్ అసోసియేషన్ కార్యవర్గం

డిస్టిక్ జడ్జిని కలిసిన నూతనంగా ఎన్నికైన కోదాడ బార్ అసోసియేషన్ కార్యవర్గం

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 08(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట పట్టణంలో జిల్లా కోర్టు నందు బుధవారం కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ఆదేశానుసారం జిల్లా జడ్జి పి లక్ష్మీ శారదను నూతనంగా ఎన్నికైన కోదాడ బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కోదాడలో నూతన కోర్టు భవనం సముదాయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసే విధంగా సహకరించాలని కోరారు. కోదాడ కోర్టులలో కావలసిన సిబ్బందిని నియమించాలని కోరారు. న్యాయవాదుల సమస్యలపై వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గట్ల నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ జానీ పాషా, ట్రెజరర్ కోడూరూ వెంకటేశ్వరరావు, గాలి శ్రీనివాస్ నాయుడు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ షేక్ రంజాన్ భాష, బాదే దుర్గ, పోలూరి హేమలత, ఓరుగంటి ధనలక్ష్మి, ఎస్ కే నాగుల్ పాషా, పిడతల హనుమంతరావు, చెన్న పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular