ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
గ్రామాల్లో పాలాభిషేకాలు
చింతలపాలెం మండలం ఏప్రిల్ 14, mbmtelugunews.com//:- భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు చింతలపాలెం మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు భారీ సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకున్నారు.
మండల కేంద్రంలోని చింతలపాలెం(మల్లారెడ్డి గూడెం) బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహానికి చింతలపాలెం తహశీల్దార్ రామకృష్ణారెడ్డి, ఎస్సై సందీప్ రెడ్డి, ఎంపీడీఓ వి.వి. రామచందర్ రావు, ఎంపీఓ ఎన్. భూపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో నడవడం ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచుల నేతృత్వంలో వేడుకలు జరిగాయి,వజినేపల్లి సర్పంచ్ సుందర్రావు, ఉప సర్పంచ్ హరీష్,
రేబల్లె సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి, ఆధ్వర్యంలో పూలదండలు వేసి నివాళులర్పించారు.
దొండపాడులో సర్పంచ్ చెన్నకేశి వెంకయ్య, ఉప సర్పంచ్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. గుడిమల్కాపురంలో సర్పంచ్ పోల్నేడి నరసమ్మ, ఉప సర్పంచ్ ఈ వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్ సేవలను కొనియాడారు.
చింతలపాలెంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మాతంగి కోటయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వి. సృజన, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. ఇంద్రరెడ్డి, ఎంఆర్‌పిఎస్ జిల్లా నాయకుడు బాలచంద్రుడు, సొసైటీ చైర్మన్ రంగాచారి, సిపిఐ మండల కార్యదర్శి సిహెచ్ రవి, విహెచ్‌పిఎస్ నాయకుడు చిలక నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు డి. ప్రభాకర్, ఎన్. విజయ్, కె. మణి, ఎన్. గోపి, సిహెచ్. వినోద్, రాకేశ్, సతీష్, పవన్, సాయిగోపి తదితరులు పాల్గొని వేడుకలను పర్యవేక్షించారు.



