Saturday, June 20, 2026
[t4b-ticker]

ఘనంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.

Mbmtelugunews//కోదాడ, జూన్ 20( ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కోఆప్షన్ మాజీ సభ్యురాలు ఒంటిపాక జానకి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవుల సమక్షంలో పెద్ద ఎత్తున శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పాస్టర్ యేసయ్య మాట్లాడుతు వేలకోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి కోదాడ,హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న తమ అభిమాన నాయకుడని కొనియాడారు. తను యవ్వన దశలో దేశ సేవలో సైనికుడిగా నేడు ప్రజాసేవలో అలుపెరగని మహా నాయకుడుగా ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోని నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో నిలిచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అందుకొని ప్రజలకు మరింతకాలం వారు సేవలు అందించాలన్నారు. బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ యేసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంపాటి పుల్లయ్య, గుండెపంగు రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు, పాస్టర్లు రాజేష్, ప్రభుదాస్, సుధారాణి, సైమన్, దీప్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular