Friday, April 17, 2026
[t4b-ticker]

ఎమ్మెల్యే పద్మావతితో రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం లో పాల్గొన్న చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు…

ఎమ్మెల్యే పద్మావతితో రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం లో పాల్గొన్న చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు…

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 17(ప్రతినిధి మతంగి సురేష్): సూర్యాపేటలోని రుద్రంగి ఫంక్షన్ హాల్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహా హాజరయ్యారు.ఈ సందర్భంగా సౌమ్య మిశ్రా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ఎస్పీ నరసింహా రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ యువత ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలన్నారు. మునిసిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular