ఘనంగా ముగిసిన మూడు రోజుల చిల్డ్రన్ సమ్మర్ క్యాంప్ విబిఎస్
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 29(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక బాప్టిస్ట్ చర్చిలో మూడు రోజులుగా పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ చిల్డ్రన్ విబిఎస్ చిల్డ్రన్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లలు ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య విషయాలు, చదువు పట్ల శ్రద్ధ, పెద్దలపట్ల గౌరవం, చదువుకోనవలసిన ఆవశ్యకత, తల్లిదండ్రులను, గురువులను సన్మానించడం వంటి విషయాలు ఎన్నో నేర్పించారు. పిల్లలు ఎంతగానో ఆధ్యాత్మికంగా మానసికంగా ఉల్లాసవంతంగా గడిపారు. చిన్నపిల్లల నాట్యాలు పెద్దలను ఎంతో ఆకర్షించాయి. స్టీఫెన్ పాల్ పప్పేడ్ షో చిన్న పిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చివరి రోజున కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు మాట్లాడుతూ పిల్లలు రేపటి పౌరులని వారిని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంచడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం అందుతుందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన యేసయ్యను అభినందించారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ చిన్న పిల్లలు దేవుని స్వభావం గల వారిని వారి పట్ల ఎంత జాగ్రత్త తీసుకొని వారికి ఎన్నో ఆధ్యాత్మి విషయాలు నేర్పిస్తున్నారు అని ఇలాంటి విషయాలు వారి భవిష్యత్తుకు పునాది లాంటివని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన యేసయ్యను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రిస్టియన్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి ఏసయ్య, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గుండెపంగు రమేష్, పిఆర్టియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య, గిరిజన టీచర్స్ రాష్ట్ర నాయకులు జగ్గు నాయక్, కోదాడ పట్టణ ఎస్సీ సెల్ కాంగ్రెస్ నాయకులు రాంబాబు, మైక్రో ఆర్టిస్ట్ ఏనుష్ తదితరులు పాల్గొన్నారు.



