Thursday, April 30, 2026
[t4b-ticker]

పౌర హక్కుల అవగాహన

పౌర హక్కుల అవగాహన

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 30(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో ఎమ్మార్వో ఆఫీస్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచి పాలకి సురేష్ పాల్గొని మాట్లాడుతూ సమానత్వం గౌరవం మరియు వివక్షకు వ్యతిరేకంగా ఉన్న హక్కుల గురించి వివరంగా తెలియజేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ 1989 ఆక్ట్ గురించి అవగాహన కల్పించి ఎవరికైనా అన్యాయం జరిగితే చట్టపరంగా ఎలా చర్యలు తీసుకోవాలో చెప్పినారు. సివిల్ రైట్స్ డే సందర్భంగా గ్రామంలో కుల వివక్షకు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అలాంటి ఏవైనా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని అవగాహన కల్పించారు. మన గ్రామము లో ప్రతి ఒక్కరినీ గౌరవించడం మన బాధ్యత మన గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మార్చాలంటే వివక్షను పూర్తిగా తుడిచిపెట్టాలి
అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి బలహీన వర్గాలను ముందుకు తీసుకురావాలని అన్నారు. మన హక్కులను కాపాడుకుందాం
ఇతరుల హక్కులను గౌరవిద్దాం అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్ఐ జగదీష్, సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ లక్ష్మీనారాయణ, జిపిఓ జబ్బార్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి సైదులు, వార్డు మెంబర్స్ పాలడుగు జాన్, కొనపర్తి తిరుమల చారి, గద్దల వెంకటేశ్వర్లు, కస్పరాజు సురేష్, ఒగ్గు నాగేంద్రబాబు, సోమపంగు గోపి, మోలుగూరి ఏసోబు, సొందు, పాశం వీరస్వామి, కాసిమల్ల రవి, నారకట్ల ప్రసాద్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular