Saturday, May 9, 2026
[t4b-ticker]

గొండ్రియాల పిఎసిఎస్ చైర్పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న నెల్లూరి ఉషారాణి

గొండ్రియాల పిఎసిఎస్ చైర్పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న నెల్లూరి ఉషారాణి

Mbmtelugunews// అనంతగిరి, మే 09(ప్రతినిధి మాతంగి సురేష్): ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు కాల పరిమితి పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిన సంగతి తెలిసినదే. రాష్ట్రంలో పాలకవర్గాల పునరుద్దీకరణ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలలో పాత పాలకవర్గాలనే నియమిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

ఈ ఉత్తర్వులు ప్రకారం గొండ్రియాల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘము నందు చైర్ పర్సన్ గా నెల్లూరి ఉషారాణి, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించనైనది. సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మీ అందరి నాయకత్వంలో రైతులకు, గ్రామ అభివృద్ధికి మరింత సేవ చేసి సంఘం మరింత అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకొండ లచ్చయ్య, డైరెక్టర్లు నాగయ్య, నరసింహారావు, కొండలు, వెంకటప్పయ్య, పూర్ణయ్య, వైస్ సర్పంచి బండ్ల రమేష్, మాజీ ఎంపీటీసీ మన్నెం కృష్ణవేణి హరీష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి రామారావు, తిరుమలరావు, పిఎసిఎస్ సిబ్బంది, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular