*మేళ్లచెరువులో కనులపండువగా హనుమాన్ జయంతి వేడుకలు*
మేళ్లచెరువు, మే 12, mbmtelugunews.com:-స్థానిక మండల కేంద్రమైన మేళ్లచెరువులో వేంచేసి ఉన్న పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా, కనులపండువగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో సువర్చల సమేత ఆంజనేయస్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అనంతరం భక్తుల ఆర్థిక సహాయ సహకారాలతో ఆలయ ఆవరణలో మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులందరికీ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ వేడుకల్లో దేవాలయ చైర్మన్ శెట్టి రాజ్‌కుమార్, ఆలయ పూజారులు సుదర్శన మోహన కృష్ణాచార్యులు, కృష్ణప్రసాద్, ఆలయ సేవకులు, మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
RELATED ARTICLES



