నడిగూడెం సర్పంచి ని సన్మానించిన మిత్రులు
Mbmtelugunews//కోదాడ/నడిగూడెం, జూన్ 14( ప్రతినిధి మాతంగి సురేష్): మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-86 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఇటీవల నడిగూడెం గ్రామ సర్పంచి గా ఎన్నికైన మిత్రుడు దున్నా శ్రీనివాస్ ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము చదువుకున్న పాఠశాలలో చదువుకొని మాకు పరిచయం ఉన్న వ్యక్తి నడిగూడెం సర్పంచిగా ఎన్నిక కావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని, గ్రామాభివృద్దే ద్యేయంగా పనిచేయాలని వారు కోరారు. గ్రామాభివృద్ధిలో మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. సన్మానించిన వారిలో జంపాల శ్రీనివాస్, యం సందీప్ కుమార్, దారా వెంకటేశ్వర్లు, కే శ్రీనివాస్ చారి, గులాం మహమ్మద్ జానీ, మరియమ్మ తదితరులు ఉన్నారు.



