Saturday, June 20, 2026
[t4b-ticker]

మచ్చలేని మహానేత ఉత్తమ్

మచ్చలేని మహానేత ఉత్తమ్

:కోదాడ హుజూర్ నగర్ నియోజక వర్గాల అభివృద్ధికి పట్టు విడవని విక్రమార్కుడు.

:రైతుల పాలిట బాంధవుడు. ప్రాజెక్టుల అపర భగీరధుడు ఉత్తమ్

:బాషబోయిన భాస్కరరావు

Mbmtelugunews//కోదాడ, జూన్ 20( ప్రతినిధి మాతంగి సురేష్) : కోదాడ హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు బాషబోయిన భాస్కర్ రావు అన్నారు. భాస్కరరావు ఆధ్వర్యంలో శనివారం పట్టణములోని స్థానిక బాసుమియా కూరగాయల మార్కెట్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాడు దేశ సేవలో ఖ్యాతి గాంచిన సైనికుడుగా
నేడు ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి జీవితాన్ని ప్రజలకు త్యాగం చేస్తున్నారని తెలిపారు. మంత్రిగా రాష్ట్రంలోను ఎమ్మెల్యేగా తన సొంత నియోజకవర్గాం తో పాటు కోదాడ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి నీ పరుగులు పెట్టిస్తు ప్రభుత్వం లో కీలకంగా మారిన అగ్రనేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అని గుర్తు చేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి గా రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సాగు నీరు ఇబ్బందులు కలుగకుండా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్న అపర భగీరదుడు ఉత్తమ్ అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గా దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని సన్న బియ్యం పధకం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న అన్న దాత ఉత్తమ్ అని కొనియాడారు.

కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాలు రెండు కళ్లలా భావిస్తూ రెండు నియోజక వర్గాల్లో రోడ్లు, విద్యా, వైద్య, విద్యుత్,సాగు నీరు, తాగు నీరు, విద్యుత్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలకు, సదుపాయాలకు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించిన అభివృద్ధి ప్రదాత అని తెలిపారు. ప్రజలే కుటుంబంగా భావించి దంపతులు ఇద్దరు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజల గుండె ల్లో నిలిచారని కొనియాడారు. ఉన్నత విద్యలు అభ్యసించి నేడు రాష్రాన్ని దేశం లో ఆదర్శం గా నిలుపుతున్న అపర మేధావి ఉత్తమ్ అన్నారు. దేశ విదేశాలు పర్యటించి రాష్ట్ర గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటిన అగ్ర నాయకుడు ఉత్తమ్ అన్నారు. భవంతుని ఆశీస్సులతో భవిష్యత్తు లో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బద్దం భద్రారెడ్డి, పంది తిరుపతయ్య, రాయపూడి వెంకటనారాయణ, బరపడ కోటేశ్వరరావు, నెట్టెం నాగేంద్రప్రసాద్, హనుమంతరావు, కంటూ నాగేశ్వరరావు, గుండ్లపల్లి ఎంకన్న, తాటికొండ నాగిరెడ్డి, గుడిపూరి పున్నయ్య, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం అభిమానులకు మిఠాయిలను అందజేశారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular