దేశ సరిహద్దులలో గెలిచి తెలంగాణలో గెలిచిన నాయకుడు ఉత్తమ్
:కోదాడ 3 పర్యాయాలు గెలిచిన నాయకుడు ఉత్తమ్
:నీతి నిజాయితీ నిబద్ధతగల నాయకుడు ఉత్తమ్
:మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి
Mbmtelugunews//కోదాడ, జూన్ 20(ప్రతినిధి మాతంగి సురేష్): దేశ సరిహద్దులలో గెలిచి తెలంగాణలో గెలిచిన నాయకుడు నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ లతీఫ్ ఆధ్వర్యంలో ఉత్తంకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మట వరప్రసాద్ రెడ్డి పాల్గొని గ్రామంలోని నాయకులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి ఉత్తమ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ఏకైక నాయకుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అన్నారు. కోదాడ హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నాయని దానికి కారణం మంత్రి ఉత్తమ్ అని అన్నారు. మంత్రి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మరిన్ని పదవులు పొందాలని ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడూ మంత్రిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరేపల్లి నాగేశ్వరరావు, పెండెం మంగమ్మ, కోదాడ మండలం మహిళా అధ్యక్షురాలు సురేపల్లి మంగమ్మ,మండల పార్టీ ఉపాధ్యక్షులు ఈర్ల సీతారామరెడ్డి, రామలక్ష్యం పురం సర్పంచి గంగిరెడ్డి తులిశమ్మ కన్నారెడ్డి వివిధ హోదాల నాయకులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



