అబద్ధాల రాజకీయాలకు ప్రజలు ముగింపు పలుకుతారు..!
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు అలవాటుగా మారింది..!
అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే
బొల్లం మల్లయ్య యాదవ్ అసత్య ప్రచారం….
కోదాడ ప్రజలు అబద్ధాలను కాదు… అభివృద్ధిని నమ్ముతున్నారు.”
రాజకీయ ఆరోపణలతో కాదు… పనితీరుతోనే ప్రజల మద్దతు లభిస్తుంది. …..
ఆధారాలు లేని ఆరోపణలతో కోదాడ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది…
కాంగ్రెస్ పార్టీ నాయకులు
రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్
Mbmtelugunews//కోదాడ, జూలై 10: కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పూర్తిగా అసహనానికి గురై, వరుసగా నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ మండిపడ్డారు. బొల్లం మల్లయ్య యాదవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వారు స్పష్టం చేశారు. కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటాన్ని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వరుసగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడానికి ఆధారాలు లేని విమర్శలు చేయడం ఆయన రాజకీయ సంస్కృతికి నిదర్శనం.ప్రభుత్వ భూములు, చెరువులు, మైనింగ్, ఆక్రమణలపై ఆయన చేసిన ప్రతి ఆరోపణ గత పాలనలో జరిగాయని అన్నారు.
*రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనం*……
ఎలాంటి ఆధారాలు లేకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మాజీ ఎమ్మెల్యే స్థాయికి ఏమాత్రం తగదన్నారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా వాస్తవాలను అంగీకరించకుండా ప్రతిరోజూ కొత్త ఆరోపణలు చేయడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రభుత్వ భూములు, చెరువులు, మైనింగ్ లేదా ఇతర అంశాలపై మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు నిజంగా ఆధారాలు ఉంటే వాటిని ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు.
*అభివృద్ధి కనిపించడం లేదా?*….
కోదాడలో నియోజకవర్గం లో వందల కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, తాగునీటి పథకాలు, గ్రామీణ అభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, విద్యా–వైద్య రంగాల అభివృద్ధి, సాగునీటి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజలు ఈ అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తుండగా, మాజీ ఎమ్మెల్యే మాత్రం అభివృద్ధి కనిపించనట్టుగా మాట్లాడటం ప్రజలను అవమానించడమేనని అన్నారు.
*ప్రజల తీర్పును గౌరవించాలి*…
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రతి అంశంలో విషప్రచారం చేయడం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు తగదని హితవు పలికారు.
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుడు ఇప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవాలని ప్రయత్నించడం విచారకరమని పేర్కొన్నారు.
*దుష్ప్రచారంతో అభివృద్ధిని ఆపలేరు*…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో కోదాడ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని, ఎలాంటి దుష్ప్రచారాలు ఆ అభివృద్ధిని అడ్డుకోలేవని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన ఆధారాలు లేని ఆరోపణల పై విరమించుకుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కి, కోదాడ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



