అయ్యప్ప ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ నూతన ప్రారంభోత్సవం
Mbmtelugunews//కోదాడ, జూలై 05(మాతంగి సురేష్) :పట్టణంలోని మేళ్లచెరువు రోడ్డు లో ఆదివారం రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రోప్రైటర్ వేనేంపల్లి రవి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాప్‌ను మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు లతో కలిసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు,పురుగు మందులు సరసమైన ధరలకు అందించాలని షాప్ నిర్వాహకులు వేనేంపల్లి రవికి సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ మల్లీశ్వరి, ముడియాల భరత్ రెడ్డి,ఫెర్టిలైజర్ డీలర్స్, ప్రజాప్రతినిధులు,రైతులు పలువురు పాల్గొన్నారు.



