సర్ ప్రక్రియను నిబద్ధతతో నిర్వహించాలి.
: 34 వ వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర పాండు
Mbmtelugunews//కోదాడ, జూన్ 26(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక 34 వ వార్డులో వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర పాండు ఆధ్వర్యంలో 34 వార్డు బూత్ నెంబర్లు 202, 203 బిఎల్ఓలతో స్థానిక వార్డు ఆల్ పార్టీ పెద్దలతో ఇంటింటికి ఓటర్ సర్వే (సర్) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఓటర్ కి యాన్యుమరేషన్ పత్రాలు ఇవ్వటం, ప్రతి ఒక్క ఓటర్ కు అవగాహన కల్పించడం జరుగుతుంది అని అన్నారు. పేదల ఓట్లు పోతే వాళ్ళ ఆధార్ రేషన్ కార్డు పోతాయని చెప్పడం జరిగింది. ప్రతి బిఎల్ఓ ఇంటికి కనీసం మూడుసార్లు సందర్శిస్తారు అని చెప్పడం జరిగింది. మీకు యానిమేషన్ పత్రం నింపటం రాకపోతే బిఎల్వోలు నింపుతారని చెప్పడం జరిగింది.
ప్రతి పౌరుడు ఓటు హక్కును పోనివ్వకుండా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉన్నది కాబట్టి మనం అందరం అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఓటు హక్కు మన జన్మ హక్క కావున ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు.



