తెలుగు నేల, సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ చిరస్మరణీయులు
:ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో నందమూరి రామకృష్ణ
Mbmtelugunews//కోదాడ, జూన్ 25(ప్రతినిధి మాతంగి సురేష్) : తెలుగు నెల, సూర్యచంద్రులు ప్రకాశించినంత కాలం నందమూరి తారక రామారావు చిరస్మరణీయులని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక తమ్మరబండ పాలెంలో నందమూరి తారక రామారావు అభిమానుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి రామకృష్ణ, స్థానిక శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పిడి జనార్దన్, మాజీ ఎమ్మెల్యే వెనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహని ఆవిష్కరించారు. అనంతరం నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు నేల, సూర్యచంద్రులు ఉన్నంతవరకు, తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతవరకు తారక రామారావు చిరస్మరణీయులుగా ఉంటారని తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు తెలుగు సినిమాలలో నటించి మెప్పించని పాత్ర అంటూ లేనేలేదని అన్నారు. అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. రాయలసీమ కోస్తాల్లో వరదలు వచ్చినప్పుడు జోలె పట్టి విరాళాలు వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ నిధికి అందించిన విషయాన్ని గుర్తు చేశారు. యుద్ధం సమయంలో సైనికుల వేషధారణలో కార్యక్రమాలు చేసి తద్వారా వచ్చిన డబ్బును విరాళాలను భారత ప్రభుత్వానికి అప్పగించారని తెలియజేశారు. బీసీలకు రాజకీయ చైతన్యం కల్పించి ఎంతో మందికి రాజకీయ అవకాశం కల్పించిన మహా ఘనుడు ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూ ఇక్కడ ప్రతిష్టించిన విగ్రహం అచ్చు తారకరామారావుని చూసినట్లుగా ఉందని అంటూ, అందరినీ ఆప్యాయంగా పలకరించి తమ్మర గ్రామస్తులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటం తనకు ఎంతో ఆనందంగా ఉందని నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్, ఒకటో వార్డు కౌన్సిలర్ సామినేని రజినీ నరేష్, కోదాడ గురవయ్య, కనగాల రాధాకృష్ణ, ముత్తినేని సైదాశ్వరరావు, ఉప్పగండ్ల శ్రీనివాస్, కర్రి సుబ్బారావు, స్థానిక వార్డు కౌన్సిలర్లు వంగూరి గోపి, రాయపూడి కాటమరాజు, సుల్తాన్ సుజాత రాంబాబు, కొల్లు శత్రుజ్ఞ, ఉండకనేని నాగేశ్వరరావు, వేమూరి సతీష్, వేమూరి సత్యనారాయణ, బత్తినేని నాగేశ్వరరావు, బొల్లు రామకృష్ణ, టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



