Thursday, June 25, 2026
[t4b-ticker]

సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి : సర్పంచి మందుల నాగయ్య .

సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి : సర్పంచి మందుల నాగయ్య .

Mbmtelugunews//కోదాడ, జూన్ 25(ప్రతినిధి మాతంగి సురేష్): భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో జూన్ 24 నుండి ప్రారంభమై జూలై 24 వరకు నిర్వహిస్తున్నట్లు సర్పంచి మందుల నాగయ్య తెలిపారు. గురువారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ప్రత్యేక ఓటర్ జాబితా ప్రక్రియ సర్ ను గ్రామ సర్పంచి మందుల నాగయ్య ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు లేకుండా చూడటం, మరణించిన
వారి ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ సర్ ముఖ్య ఉద్దేశమన్నారు. మండల కేంద్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు, తప్పులు లేకుండా బిఎల్ఓ లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఓటరుకు ఎస్ఐఆర్ పత్రం అందజేసి అవగాహన కల్పించి ఓటర్ పక్రియ పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఎస్ఐఆర్ ఫామ్ లో ఓటర్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందిస్తే జరిమానా,
జైలు శిక్ష తప్పదని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న బిఎల్వోలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని బిఎల్ఓ ల యాప్ లో పొందుపరచాలని సూచించారు. ఓటర్ సవరణ ప్రక్రియకు బిఎల్ఎ లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఏ లు, గ్రామ పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular