స్వర్ణభారతి సేవలు అభినందనీయం
:మాజీ భారత ఉపరాష్ట్రపతి ముప్పారపు వెంకయ్య నాయుడు
:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కు స్వాగతం పలికిన స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్
:స్వర్ణభారతి ట్రస్ట్ సేవలు ని అభినందించిన వెంకయ్య నాయిడు
Mbmtelugunews//కోదాడ, జూన్ 25(ప్రతినిధి మాతంగి సురేష్): 13 వ ఉప రాష్ట్రపతి గా పనిచేసి, మాజీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి వర్యులు /తెలుగు దిగ్గజం ముప్పారపు వెంకయ్య నాయుడుని కలిసి సన్మానించిన స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ జెనరల్ /విజయీభవ ట్రస్ట్ వ్యవస్థాపకులు
చారుగుండ్ల ప్రవీణ రాజశేఖర్. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నో రకాల సామాజిక సేవలకు వెంకయ్య నాయుడు ద్వారా నడుస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ స్ఫూర్తితో కోదాడ ప్రాంతంలో కూడా స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడను స్థాపించబడింది.అదే స్ఫూర్తి తో ఎన్నోసామాజిక సేవలకి గత 7 సంవత్సరాలుగా ముందుకు నడుస్తున్న సంస్థ స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ అని అన్నారు.వెంకయ్య నాయుడు కి వింగ్స్ అఫ్ ఫైర్ అబ్దుల్ కలాం పుస్తకం, పుష్పగుచ్చము, శాలువాతో సాదర స్వాగతం పలుకటం జరిగింది.స్వర్ణభారతి ట్రస్ట్ కోదాడ సేవలను వెంకయ్య నాయుడు అభినందనలు తెలుపుట జరిగింది.



