Friday, June 26, 2026
[t4b-ticker]

కాపుగల్లు రామాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక పూజలు

కాపుగల్లు రామాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక పూజలు

Mbmtelugunews//కోదాడ, జూన్ 26(ప్రతినిధి మాతంగి సురేష్) : కోదాడ మండల పరధిలోని కాపుగల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శుక్రవారం గ్రామ సర్పంచి దొంతగాని అప్పారావుతో కలిసి సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో రామాలయం నిర్మాణం శుభపరిణామమని, శ్రీరాముని ఆశీస్సులతో గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద పెరిగి ప్రజలు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular