శ్వేతా క్రిస్టియన్ బుక్ హౌస్ షాపు ప్రారంభం
Mbmtelugunews//కోదాడ, జూన్ 29(ప్రతినిధి మాతంగి సురేష్) : బెతేల్ గాస్పెల్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ కాసర్ల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గుడిబండ రోడ్ లో నూతనంగా ఏర్పాటుచేసిన భారత్ సౌండ్ అండ్ లైట్స్ హౌస్, శ్వేత క్రిస్టియన్ బుక్ హౌస్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, 14వ వార్డు కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు, 19 వ వార్డు కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి పాల్గొని దైవ సేవకులు ప్రార్థన అనంతరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కోదాడ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకు సంబంధించిన శుభకార్యాలకు ఉపయోగపడే, సౌండ్ సిస్టం, లైటింగ్ సిస్టం తోపాటు దేవుని పుస్తకాలు దొరుకుతాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం ముగింపు ప్రార్థన కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బ్రదర్ రామారావు చేశారు. కోదాడ పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ సైమన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిషప్ ఏ, జే శామ్యూల్, పాస్టర్స్, శ్రీనివాస్ గౌడ్, రమేష్ , పాల్ చారి, కొర్నేలి, ఏసుబాబు, లాజర్, అబ్రహం, రాజేష్, సురేష్, జోసెఫ్ రాజు, ఇస్మాయిల్, స్టీఫెన్ పాల్, కోటయ్య, మార్టిన్, బాలు, శారా, మాజీ వార్డు కౌన్సిలర్ గంధం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.



