గిరిజన కళాశాల వసతి గృహంలో ఉత్సాహంగా ఆదివాసి దినోత్సవం.
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 09(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలో ఆదివారం గిరిజన ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. కళాశాల వార్డెన్ పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక గిరిజన నాయకులు ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియా నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు రాజు నాయక్ లు పాల్గొని గిరిజన పోరాటయోధుడు కొమరం భీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

వసతి గృహంలో విద్యార్థినులు కొమరం భీమ్ త్యాగాలను స్మరించుకున్నారు. గిరిజన సంస్కృతిని చాటేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను గిరిజన ఆదివాసుల వివిధ వేషధారణలో విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు గోపి రాథోడ్, నిఖిల్ నాయక్, ధారావత్ వెంకటేశ్వర్లు, హాస్టల్ సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.



