స్పీకర్ ను అవమానపరిచిన ఎమ్మెల్సీ తాతా-మదును బర్త్ రఫ్ చేయాలి : సర్పంచ్ దున్నా శ్రీనివాస్.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ దూషించి అవమానపరిచిన ఎమ్మెల్సీ తాతా-మదును వెంటనే బర్తరఫ్ చేయాలని నడిగూడెం సర్పంచ్ దున్నా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధమైన ఉన్నత పదవిలో ఉండి శాసనసభ స్పీకర్ గా అత్యున్నత సేవలు అందిస్తున్న స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అగౌరపర్చిన ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని. అత్యంత గౌరవమైన స్పీకర్ వ్యక్తిని అవమానించడం అంటే సభ్య సమాజాన్ని అవమానించినట్లేనన్నారు. బాధ్యతాయుతమైన పదవులు ఉన్నవారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతీయకుండా వ్యవహరించాలన్నారు. భవిష్యత్తులో రాజ్యాంగపరమైన పదవులు పొందేందుకు వీలు లేకుండా తాతా మధు పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.



