స్పీకర్‌ను అవమానించడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు…….
:అసెంబ్లీలో వీధి రౌడీల ప్రవర్తన సరికాదు. బీఆర్‌ఎస్ వైఖరిపై ధ్వజమెత్తిన బహుజన నాయకులు……
:ఎమ్మెల్సీ తాతా మధుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి…..
:జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాంపాటి శ్రీను…….
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేసి పదేళ్ల పాటు ఏ పదవీ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పిడతల శ్రీను ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు సమావేశమై బీఆర్‌ఎస్ వైఖరిపై ధ్వజమెత్తారు.ఈ సమావేశానికి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాంపాటి శ్రీను ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించకుండా బిఆర్ఎస్ పార్టీ నాయకులు వీధి రౌడీల మాదిరిగా ప్రవర్తించడం, మహిళా ప్రజాప్రతినిధులపై దౌర్జన్యానికి దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.శాసనసభ గౌరవాన్ని దిగజారుస్తూ రౌడీయీజం చేయడం, మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడటం సరికాదన్నారు.స్పీకర్ పదవికి భంగం కలిగించేలా వ్యవహరించిన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బహుజన నాయకులు బాజాన్, గుండెపంగు రమేష్, గంధం గిరి, రాజు నాయక్, లిక్కి మోహన్ రావు, సంజీవ్, శోభన్, జానీ, యేసయ్య, రఫీ, ఖాసీం భాయ్, ఖలీల్, షఫీ,అహ్మద్, వీరబాబు, ప్రవీణ్, రాంబాబు,పిడమర్తి బాబురావు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు……



