ఏబీవీపీ విద్యార్థుల అక్రమ అరెస్టులు సరికాదు: గుంజ నవీన్
Mbmtelugunews//అనంతగిరి, సెప్టెంబర్ 12 (ప్రతినిధి మాతంగి సురేష్):అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 12-09-2026న విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికిపిలుపునివ్వడం జరిగింది. ఎబివిపి రాష్ట్ర నాయకులు గుంజ నవీన్ ను అనంతగిరి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుంజ నవీన్ మాట్లాడుతూ… ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ నాయకులను ముందస్తు అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి, వాటి గురించి ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయం అని అన్నారు. ఏబీవీపీ ఎప్పటినుంచో విద్యార్థుల హక్కులు, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా రంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాలు నిర్వహిస్తోంది. ఇటువంటి అక్రమ అరెస్టులతో ఉద్యమ స్ఫూర్తిని అణచివేయలేరు ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలపై స్పందించి, పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వ భిక్ష కాదు విద్యార్థుల హక్కు అని అన్నారు.



