జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గా పులి.శ్రీవాస్
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా ఎంఈఎఫ్ జిల్లా బాడీ సమావేశాన్ని ఆదివారం సాయంత్రం సూర్యాపేటలో ఏర్పాటు చేసినారు. ఈ జిల్లా బాడీలో కోదాడ కు చెందిన పులి శ్రీనివాస్ ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక ఎంఈఎఫ్ జాతీయ కో – చైర్మన్ డా.కత్తి వెంకటేశ్వర్లు మాదిగ, జాతీయ ఉపాధ్యక్షులు మల్లెపాక వెంకన్న మాదిగ, జాన్ విల్సన్ మాదిగ, పిడమర్తి సైదులు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు చెబర్తి యాదగిరి మాదిగ, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ వల్లపట్ల కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నియామకం చేపట్టారు. అనంతరం పులి శ్రీనివాస్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. సంఘ బలోపే దానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు డివిజన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు



