Tuesday, August 4, 2026
[t4b-ticker]

ఇంటర్మీడియట్ విద్యార్థులు కష్టపడి లక్ష్యాలు సాధించాలి.

ఇంటర్మీడియట్ విద్యార్థులు కష్టపడి లక్ష్యాలు సాధించాలి.

Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 04(ప్రతినిధి మాతంగి సురేష్) : ఇంటర్మీడియట్ విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో తాము అనుకున్న లక్ష్యలను సాధించాలని ఎన్ఆర్ఎస్ కాలేజీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి అన్నారు. మంగళవారం కాలేజ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు నిర్వహించిన ఫ్రెషర్ పార్టీలో ఆయన పాల్గొని మాట్లాడారు.విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ దశ కీలకమని ఇక్కడినుండే విద్యార్థి భవిష్యత్తు లక్ష్యాల సాధన ప్రారంభమవుతుందన్నారు. ఇలాంటి ఇంటర్మీడియట్ విద్యలో విద్యార్థులు రాణించేందుకు తమ కాలేజ్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ విద్యార్థులు భయం వీడి సీనియర్ విద్యార్థులతో కలిసిపోవడానికి ఫ్రెషర్ పార్టీ లు ఉపయోగపడతాయని అన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్స్ కు మార్గదర్శకులుగా ఉండి వారికి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ (జీ వీ), వైస్ ప్రిన్సిపల్ పీఎన్ఆర్, పలువురు లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular