తెలంగాణ భావజాల దిక్సూచి జయశంకర్
: సర్పంచి గువ్వల శిరీష వెంకట్
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 06, (ప్రతినిధి మాతంగి సురేష్) : పుట్టుక, చావు నీది బతుకంతా తెలంగాణది అనే చందంగా తెలంగాణ భావజాల దిక్సూచి జయశంకర్ సార్ జీవితం సాగిందని సర్పంచి గువ్వల శిరీష వెంకట్ కొనియాడారు. మండల పరిధిలోని అట్లూరు గ్రామంలో గురువారం ఆయన జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….. తెలంగాణ దారి దీపంగా, జ్ఞాన సూత్రంగా ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ఆయన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. ఎంతో మందికి ఆయన జీవితం ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



