ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 14( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి
డా కత్తి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మనం విగ్రహాలలో, ఫోటోలలో కాకుండా పుస్తకాలలో ఆయనను చూడాలని, ఆయన రచించిన పుస్తకాలను చదివి అంబేద్కర్ ని అర్థం చేసుకొని వారి ఆశయాల కనుగుణంగా కృషి చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నందిగామ ఆనంద్, ఎంఈఎఫ్
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏపూరి పర్వతాలు, ఎంఈఎఫ్
జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి రవి, బొల్లికొండ కోటయ్య, పులి వెంకటేశ్వర్లు, ఎం వెంకటరమణ, ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి మాదాసు బాబు, అమరబోయిన వెంకటరత్నం, యలమర్తి శౌరి, గంధం రంగారావు, నందిపాటి సైదులు, ఇరుగు కిరణ్ కుమార్, నందిగామ ఈశ్వర్, గంధం బుచ్చారావు, మేళ్లచెరువు వీరభద్రం, కుర్రి నాగరాజు గారు, చెరుకుపల్లి మహేష్ గారు, తమలపాకుల సైదులు తదితరులు పాల్గొన్నారు.



