ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
:1969 నుండి 2014 వరకు త్యాగాలే తెలంగాణ రాష్ట్ర సాధన
:సర్పంచి మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడ, జూన్ 02(ప్రతినిధి మాతంగి సురేష్) : 1969 నుండి 2014 వరకు వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యల త్యాగపరితమే తెలంగాణ రాష్ట్ర సాధన అని సర్పంచి మందుల నాగయ్య అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గ్రామ సర్పంచి మందుల నాగయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి లు పాల్గొని జండా ఎగరవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించిందని అన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, లేదా తెలంగాణ బిల్లు ను ప్రవేశపెట్టింది. 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన త్యాగం ఎనలేనిదని కొనియాడారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి ఆశీస్సులతో గుడిబండ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇర్ల నరసింహారెడ్డి, ఉప సర్పంచి జయసింహారెడ్డి, పాలకవర్గ వార్డు సభ్యులు, గ్రామ సిబ్బంది, ప్రజలు పాల్గొనడం జరిగింది.



