Thursday, August 6, 2026
[t4b-ticker]

తల్లి, బిడ్డ మధ్య సన్నిహిత భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

తల్లి, బిడ్డ మధ్య సన్నిహిత భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

:కౌన్సిలర్ కాటంరాజు

Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 05(ప్రతినిధి మాతంగి సురేష్): తల్లి, బిడ్డ మధ్య సన్నిహిత భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే, ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు ఇతర ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలని కౌన్సిలర్ కాటంరాజు అన్నారు. పట్టణ పరిధిలోని అంగన్వాడి మొదటి సెంటర్ లో అంగనవాడి టీచర్ వెంకటరమణ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కౌన్సిలర్ కాటంరాజు పాల్గొని వారోత్సవాలను ప్రారంభించారు అనంతరం అంగన్వాడి టీచర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తల్లిపాలకు ప్రాధాన్యత ఇద్దాం. సుస్థిరమైన సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేద్దాంమన్నారు. తల్లిపాలు నవజాత శిశువుకు అత్యంత సంపూర్ణమైన మొదటి ఆహారం. తల్లిపాలు శిశువుకు మొదటి టీకాగా పనిచేస్తాయి పుట్టుకతోనే రోగనిరోధక శక్తిని అందించి అనేక వ్యాధుల నుండి కాపాడతాయన్నారు. మొదటి 1000 రోజులలో శిశువుకు కావాల్సిన అన్ని పోషకాలు, రోగనిరోధక శక్తి తల్లిపాల ద్వారా లభిస్తాయన్నారు. తల్లిపాలు తాగే శిశువులలో అతిసారం, న్యుమోనియా, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువ, మెదడు, శరీర ఎదుగుదలకు తోడ్పడి – జీవితాంతం ఆరోగ్యానికి పునాది వేస్తుంది. తల్లి నుండి సంక్రమించిన యాంటీబాడీలతో నిండి ఉండటం వలన శిశువును వైరస్లు, బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త నాగలక్ష్మి, అంగనవాడి ఆయా సరోజన, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular