మండలం లో నూరు శాతం డిజిటలైజేషన్
Mbmtelugunews//నడిగూడెం, జులై 30(ప్రతినిధి మాతంగి సురేష్): సర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతు వేదికలో గురువారం బిఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. తహసిల్దార్ ఎల్ మంగ పాల్గొని మాట్లాడుతూ మండలంలో నూరు శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. అందరికీ ఫారాలు సకాలంలో అందించడంతోపాటు వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసినట్లు తెలిపారు. స్థానికంగా ఉండని వారు, మృతి చెందిన వారు, అనర్హులు ఎవరైనా ఉంటే వారి వివరాలను మరోసారి చూసుకోవాలని సూచించారు. పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి గావించినట్లు తెలిపారు. ఆగస్టు 3 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



