నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు
ఘనంగా తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకులు
Mbmtelugunews//కోదాడ, జూన్ 02(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని రామలక్ష్మిపురం గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెం అంజిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జండా ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల లో జరుగుతున్న అన్యాయాన్ని కవులు కళాకారులు రాజకీయ నాయకులు యువత ఉద్యోగస్తులు తో సహా నాలుగు కోట్ల ప్రజల సుదీర్ఘ పోరాటంతో 02 జూన్ 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని. నేటికి సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని పలువురు పుర ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, పెద్దలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



