నియోజకవర్గ పాస్టర్స్ నూతన కోర్ కమిటీ ఎన్నిక
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 12(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ కమిటీ సమావేశం స్థానిక బాప్టిస్ట్ చర్చిలో గురువారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 5 మండలాల అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సమావేశంలో సభ్యులందరూ కలిసి నూతన కోర్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సెక్రెటరీగా పాస్టర్ జోసఫ్ రాజు ఎన్నికయ్యారు.నూతన కోర్ కమిటీ సభ్యులు కమిటీ చైర్మన్ రెవరెండ్ డా. వి యెషయా, వర్కింగ్ చైర్మన్ యేసు పాదం, చీఫ్ కోఆర్డినేటర్ పాస్టర్ ప్రసాద్, చీఫ్ ఆర్గనైజర్ పాస్టర్ యేసు రత్నం ఈ నూతన కమిటీని సేవకులందరూ బలపరిచి ప్రార్థించారు.

ఈ కమిటీ దేవుని నామములో బలంగా పనిచేయునట్లు అందరూ ప్రార్థించగలరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నియోజకవర్గ పాస్టర్స్ అధ్యక్షులు బ్రదర్ రామారావు, వర్కింగ్ అధ్యక్షులు పాస్టర్ రమేష్, ట్రెజరర్ పాస్టర్ పాల్ చారి,
చిలుకూరు మండల అధ్యక్షులు అబ్రహం, అనంతగిరి మండల అధ్యక్షులు పాస్టర్ రాజేష్, మోతే మండల అధ్యక్షులు పాస్టర్ లాజరస్, మునగాల మండల అధ్యక్షులు పాస్టర్ సిలువ రాజు, నడిగూడెం మండల అధ్యక్షులు పాస్టర్ గాబ్రియేల్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ ప్రభుదాస్, వివిధ మండలాల కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.



