Monday, November 9, 2026
[t4b-ticker]

క్రైస్తవులపై దాడులను ఖండిస్తూ కోదాడలో భారీ శాంతియుత ర్యాలీ

క్రైస్తవులపై దాడులను ఖండిస్తూ కోదాడలో భారీ శాంతియుత ర్యాలీ

:పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐకి, అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రాల సమర్పణ.

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్) : దేశవ్యాప్తంగా క్రైస్తవులపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, క్రైస్తవుల హక్కుల పరిరక్షణ, మత స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం కోదాడ పట్టణంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో క్రైస్తవ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంఘ పెద్దలు, మహిళలు, యువకులు, క్రైస్తవ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు తొలుత కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని పట్టణ సీఐకి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ కూడా వినతిపత్రం సమర్పించారు. క్రైస్తవుల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడాలని, ప్రార్థనా మందిరాలకు రక్షణ కల్పించాలని, మత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను అరికట్టాలని నాయకులు ఈ సందర్భంగా కోరారు.

*ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు*

ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ కో-ఆప్షన్ సభ్యురాలు ఒంటెపాక జానకి ఏసయ్య, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు పంది తిరుపతయ్య, సీపీఎం పార్టీ నాయకులు ముత్యాలు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుడుముల రాంబాబు, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు వి యేసయ్య, క్రైస్తవ నాయకులు రూజ్‌వెల్ట్, జిఆర్ అబ్రహం, కర్ల ప్రభుదాస్, డేవిడ్ రాజారావు, శాంత వర్ధన్, రాజేష్, సామేలు, కిరణ్, పాల్ చారి, జాన్, కోటయ్య, జాన్ చలమయ్య, డాకూరి ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కోదాడ పట్టణంలోని వివిధ చర్చిల సంఘ పెద్దలు, పాస్టర్లు, మహిళలు, యువకులు మరియు క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

*శాంతి, సమానత్వం, మత స్వేచ్ఛే మా ఆకాంక్ష*

క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని, భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను ప్రతి పౌరుడికి సమానంగా అమలు చేయాలని, అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా జీవించే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
కోదాడ క్రైస్తవ సమాజం ఐక్యతతో, క్రమశిక్షణతో, శాంతియుతంగా నిర్వహించిన ఈ ర్యాలీ విజయవంతము చెసారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular