తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేద్దాం
:కోదాడ మండల టీడీపీ అధ్యక్షుడు కట్టా సతీష్.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 09 (ప్రతినిధి మాతంగి సురేష్): దీపావళి పండుగ సందర్భంగా తొగర్రాయి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ అభిమానులు కోదాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కట్టా సతీష్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కట్టా సతీష్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వైపు మరింత మంది ఆకర్షితులవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పార్టీలో పనిచేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిలో చాలామంది తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అందరం ఐక్యంగా, సమిష్టి కృషితో ముందుకు సాగుతూ కోదాడ మండలంతో పాటు ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధూపాటి సతీష్, పోతురాజు గోపికృష్ణ, అమరబోయిన నాగేశ్వరరావు, కంపసాటి వినోద్, ధూపాటి మధు తదితరులు పాల్గొన్నారు.



