నిరసన వ్యక్తం చేస్తూ నీళ్లు పోసిన పర్యావరణ ప్రేమికులు
:నీళ్లు పోయక పోవటంతో ఎండిపోతున్న మొక్కలు, చెట్లు.
:నీళ్లు పెడుతూ కనపడని మున్సిపల్ వాటర్ ట్యాంకర్లు
:పట్టించుకోని మున్సిపల్ అధికారులు,ప్రజాప్రతినిధులు.
Mbmtelugunews//కోదాడ, జూన్ 02(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణం లోని ప్రధాన రహదార్ల డివైడర్ల లో ఉన్న మొక్కలు, చెట్లకు ట్యాంకర్ల తో వెంటనే నీళ్లు పోయాలని పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. మంగళవారం కోదాడ పట్టణ ప్రధాన రహదారి హుజుర్ నగర్ రోడ్డులో మాస్టర్ మైండ్స్ స్కూల్ ఎదురుగా ఉన్న డివైడర్ లో నీళ్లు లేక ఎండి పోతున్న చెట్లు, మొక్కలకు పర్యావరణ ప్రేమికులతో కలసి బకెట్లతో నీళ్లు పోశారు. మరో రెండు మూడు రోజులలో పట్టణంలో డివైడర్లలో ఉన్న అన్ని చెట్లకు, మొక్కలకు నీళ్లు పోయక పొతే అవి ఎండిపోయి, చనిపోతాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రదినిధులు వెంటనే స్పందించి చెట్లకు, మొక్కలకు పాదులు చేసి నీళ్లు పోసే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ స్కూల్ ప్రతినిధులు పొట్టా కిరణ్ కుమార్, రమేష్,యోగా శిక్షకులు కీతా శ్రీనివాసరావు, విద్యార్థులు లేఖన, అన్విత, యష్మిత్, శ్రీహస్, శ్రీహన్షిక్ పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.



