Tuesday, May 12, 2026
[t4b-ticker]

నేటి విద్యార్థులే రేపటి నవభారత సారధులు

:విద్యతోనే సామాజిక ఆర్థిక స్వాలంబన

: ఎమ్మెస్ విద్యాసంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి

Mbmtelugunews//కోదాడ, మే 11(ప్రతినిధి మాతంగి సురేష్): అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) కోదాడ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పాలిటెక్నిక్, టీజీ ఆర్జెసి శిక్షణ ముగింపు సమావేశం స్థానిక ఎమ్మెస్ కళాశాల లో ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెస్ కళాశాలల అధినేత పందిరి నాగిరెడ్డి, ఇరిగేషన్ జేఈ బల్గూరి దుర్గయ్య, శ్రీనివాస్ రెడ్డి, కుడుముల స్వామిదాసు, వరహాలరెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఆస్క్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా అన్ని వర్గాల విద్యార్థులకు ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ అందించడం ఎంతో అభినందనీయం అన్నారు.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని, పాలిటెక్నిక్ లో మంచి కళాశాలలో సీటు సంపాదించి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరారు. మీరు ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత పే బ్యాక్ టు సొసైటీ లో భాగంగా మీరు కూడా సమాజ సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు, కోర్స్ డైరెక్టర్ ఎలమర్తి శౌరి, గంధం బుచ్చారావు, బొడ్డు హుస్సేన్, అమరబోయిన వెంకటరత్నం, నందిపాటి సైదులు, మేళ్లచెరువు వీరభద్రం, చెరుకుపల్లి కిరణ్, కన్నయ్య, షరీఫ్,గిరి ప్రసాద్, శ్రీకాంత్, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular