Saturday, April 18, 2026
[t4b-ticker]

ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి వేడుకలు మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఘనంగా నిర్వహించినారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ జీవితం ఆయన నడిచిన విధానం ఆయన సాధించిన విజయాలు అందరికీ ఆదర్శమైనవని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసి ఈ దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ప్రసంగించినారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్సై పులి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచి పులి శ్రీను, ఎమ్మార్పీఎస్ కోదాడ మండలం మాజీ అధ్యక్షులు పులి రాజారావు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ హసన్ అలీ, కోదాడ సొసైటీ మాజీ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ నాగరాజు, గుడిబండ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు బుచ్చి రామయ్య, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ బహుద్దిన్, గ్రామపంచాయతీ సభ్యులు ఓ రమాదేవి, పులి అనిత, మాదిగ ఉద్యోగస్తుల సంఘ నాయకులు పులి నరసింహారావు, బచ్చయ్య, మాతంగి శ్రీను, పులి మైసయ్య, ఎల్ వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ నాగమణి, ఉపేందర్, బాబు, కలకొండ ఉపేందర్, సుధాకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular