Sunday, May 31, 2026
[t4b-ticker]

బదిలీపై వెళుతున్న కార్యదర్శి కి వీడ్కోలు

బదిలీపై వెళుతున్న కార్యదర్శి కి వీడ్కోలు

Mbmtelugunews//కోదాడ,మే 30(ప్రతినిధి మాతంగి సురేష్) : బదిలీపై వెళ్తున్న కార్యదర్శి కి వీడ్కోలు పలికిన గ్రామ సర్పంచి, పాలకమండలి. మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి అవినాష్ బదిలీపై ఎస్ ఆత్మకూరు మండలానికి వెళుతున్న సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచి లిక్కి గురవమ్మ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యదర్శిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి లిక్కి గురవమ్మ వెంకటయ్య మాట్లాడుతూ బదిలీపై వెళుతున్న గ్రామ కార్యదర్శి అవినాష్ ను గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రజలు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఘనంగా సన్మానించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం
గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికి శాలువాలతో సత్కరించారు.

అలాగే కార్యదర్శి అవినాష్ మాట్లాడుతూ తొగర్రాయి గ్రామపంచాయతీ ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించారని ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధిలో చేయూతనందించారని తెలిపారు. గ్రామ ప్రజల మంచితనాన్ని మర్చిపోలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అమరబోయిన ఉమామహేశ్వరి శ్రీను, దేవాలయ కమిటీ చైర్మన్ పైడిమర్రి సరస్వతి మదన్మోహన్, జిల్లా పార్టీ కార్యదర్శి పులి సులోచన రావు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, మాజీ సర్పంచి దొంగల లక్ష్మీనారాయణ, పల్లె శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షులు వెంకటేష్, వెంకయ్య, యాలాద్రి, పుల్లయ్య, ధనమూర్తి, వార్డ్ నెంబర్లు పుణ్యవతి వీరయ్య, నరేష్, స్రవంతి, కొండలు, కిషోర్, వినోద్ కుమార్, మునగ మధు, రామారావు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular