యువత మత్తు బారిన పడొద్దు
:తల్లిదండ్రుల కల నెరవేర్చడం మన బాధ్యత.
:కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి
:వ్యాయామంతోనే ఆరోగ్యకరమైన జీవితం: డాక్టర్ జాస్తి సుబ్బారావు
Mbmtelugunews//కోదాడ, మే 17( ప్రతినిధి మాతంగి సురేష్): యువత బెట్టింగ్ వంటి వ్యసనాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోని తల్లిదండ్రులకు భారంగా మారొద్దని కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చడం యువత బాధ్యత డ్రగ్స్, బెట్టింగ్ ఫ్రీ కోదాడ అనే నినాదంతో యువత డ్రగ్స్ బెట్టింగ్ వంటి వ్యసనాల బారిన పడకుండా అవగాహన కల్పించే లక్ష్యంతో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కోదాడలో 5కే రన్ అండ్ వాక్ నిర్వహించారు. కోదాడలోని బాయ్స్ హై స్కూల్ కేంద్రంగా నిర్వహించిన ర్యాలీలో మొత్తం 650 పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి పాల్గొని రన్ లో పాల్గొన్న అందరికీ ఉచితంగా టీ షర్ట్స్, మెడల్స్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కత్రం చారిటబుల్ ఫౌండేషన్ అనేది కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే కాదని అది తాను చేపట్టిన సామాజిక బాధ్యత అని తెలిపారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను నిజాయితీ నిబద్ధతతో కష్టపడి ఉన్నతంగా ఎదిగిన తరువాత తాను పుట్టిన కోదాడ ప్రాంతానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే కత్రం చారిటబుల్ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు.

యువతను ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ముఖ్యంగా తమ కత్రం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య సేవా కార్యక్రమాలతో పాటు యువతను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యులు సామాజికవేత్త డాక్టర్ జాస్తి సుబ్బారావు మాట్లాడుతూ వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. కుటుంబాలను నాశనం చేసే డ్రగ్స్ జోలికి యువత వెళ్లవద్దని సూచించారు. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ రవాణా చేసినా, స్వీకరించైనా నాన్ బెయిల్ కేసులు నమోదవుతాయన్నారు. యువత మత్తు బారిన పడకుండా ఉండాలంటే క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలపై మక్కువ పెంచుకోవాలన్నారు. కోదాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు మాట్లాడుతూ సామాన్య ప్రజల కోసం కత్రం చారిటబుల్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. ముఖ్యంగా కత్రం శ్రీకాంత్ రెడ్డి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా కష్టపడి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. రన్ తరువాత హైదరాబాదు నుంచి వచ్చిన ఫిట్నెస్ ట్రైనర్ బృందం వారితో డాన్స్ సక్సెస్ చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్, కబడ్డీ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి నామ నాగేశ్వరరావు, డ్రస్ వ్యతిరేక ప్రచారకర్త ప్రభుత్వ వైద్యులు ప్రభాకర్, కోదాడ క్లబ్ అధ్యక్షుడు కత్రం సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



