మేళ్లచెరువు, ఏప్రిల్ 23 mbmtelugunews.com//:
మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన మాజీ సొసైటీ డైరెక్టర్ రంగిశెట్టి రాఘవయ్య ధర్మపత్ని రంగిశెట్టి సుబ్బమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన ఆమె దశదిన కార్యక్రమానికి బిఆర్ఎస్ నాయకులు పిలుట్ల రఘు హాజరయ్యారు. సుబ్బమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సూరిశెట్టి బసవయ్య, మాజీ ఎంపీపీ పాలేటి రామారావు, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొట్టే నరసింహారావు పాల్గొన్నారు. అలాగే గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నాగులు మీరా, సురేష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ పటాన్ రసూల్ ఖాన్, బీసీ సెల్ అధ్యక్షులు కితా గురవయ్య, ఉప సర్పంచ్ రంగిశెట్టి వీరభద్ర రావు తదితరులు పాల్గొని సుబ్బమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వార్డు సభ్యులు, బిఆర్ఎస్ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రంగిశెట్టి సుబ్బమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన పిలుట్ల రఘు
RELATED ARTICLES



