వరికొయ్యలు కాల్చకుండా పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత
:సర్పంచి మందుల నాగయ్య
:వరి కొయ్యలు కాల్చితే 5000 నుండి 25000 వరకు జరిమానా
: ఎస్సై గోపాల్ రెడ్డి
Mbmtelugunews//కోదాడ, మే 30(ప్రతినిధి మాతంగి సురేష్) : రైతులు వరి పంట కోసిన తర్వాత పొలం పై ఉన్న వరి కొయ్యలను కాల్చడం వల్ల అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని, అందువల్ల ఎవరు వరి కొయ్యలను తగలబెట్టవద్దని సర్పంచి మందుల నాగయ్య, రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి, ఏవో రజిని అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామపంచాయతీ కార్యాలయంలో వరి కొయ్యలను తగలబెట్టకుండా రైతులకు అవగాహన కార్యక్రమని వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచి మందులు నాగయ్య రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ వరికోయ్యలు తగలబెడితే భూమి సారవంతం కోల్పోతుందని, అనంతరం దుక్కి దున్నినప్పటికీ గుల్లగా మారదని, దీనివల్ల పంట దిగుబడి తగ్గుతుందని అన్నారు.

సాంద్రత పెంచుకునేందుకు అధిక ఎరువులు వాడాల్సి వస్తుందని ఆ భారం కూడా రైతుల పైన పడుతుందని తెలిపారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు, రహదారులపై వెళ్లే వాహనదారులకు కూడా ఇబ్బందులు వస్తాయని, వరి కొయ్యల వల్ల పక్కన ఉన్న చెట్లు, ఇతర విలువైన వస్తువులు పరికరాలు తగలబడే అవకాశం ఉందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులు ఎట్టి పరిస్థితులలో వరి కోయ్యలను తగలబెట్ట వద్దన్నారు. రైతులు వరికొయ్యలను తగలబెట్టకుండా ఉండేందుకుగాను వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వరి కొయ్యలు తగలబెట్టడం వలన ప్రమాదాలు సంభవించినప్పుడు బాధ్యులపై చట్టపరమైన చర్యలుతో పాటు 5000 వేల నుండి 25000 వేల వరకు జరిమానా విధిస్తారని హెచ్చరించారు.ఈ
కార్యక్రమం లో ఏవో రజిని, ఏఈఓ సల్మా, గ్రామ ఉపసర్పంచ్ ఈర్ల జై సింహా రెడ్డి, గుడిబండ గ్రామ కార్యదర్శి అవినాష్ రెడ్డి, రైతులు ఈర్ల నరసింహారెడ్డి, ప్రసాద్ రెడ్డి, మాదాసి నాగరాజు, ఇస్సాకు, సోమపంగు శ్రీను, పున్నయ్య, పసుపులేటి గురవయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది ఆశాలు గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు.



