కోదాడ,జూన్ 23(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ నియోజకవర్గ ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని బిఎస్పి కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోనీ బండ లక్ష్మీపురం గ్రామంలో సభండవర్గాలకు చెందిన వారు వడ్డెర,యాదవులు,ముస్లింలు,ఇలా 30 కుటుంబాలకు బిఎస్పి పార్టీ కండువా కప్పి పార్టలోకి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు.బిఎస్పి పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంటే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని తెలిపారు.కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరిగాయని ప్రశ్నిస్తే అధికారులు నోరు మెదపడం లేదు అని అన్నారు.ప్రజలకు తెలియదా మీరు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు రాబోవు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.పార్టీలో చేరినవారు ప్రధానంగా షేక్ ఖాసీం, మునుకుంట్ల శంకర్,మునుకుంట్ల ఆది,కాంపాటి వీరబాబు తదితరులు ఉన్నారు.వీరితో పాటు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చింతల రమేష్,అనంతగిరి మండల అధ్యక్షుడు నూకల గోపాలస్వామీ యాదవ్ లు పాల్గొన్నారు.
వరుస చేరికలతో కోదాడలో జోరు అందుకున్న బీఎస్పీ:పార్టీ బలపేతం కోసం అభివృద్ధి కార్యక్రమాలు.:ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ:బీఎస్పీ పార్టీ కోదాడ ఇంచార్జి పిల్లుట్ల శ్రీనివాస్
RELATED ARTICLES