కోదాడ,జులై 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రముఖ వైద్యులు గత 40 సంవత్సరాలుగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం తో పాటు అతి తక్కువ ధరలకు వైద్యము అందిస్తూ ఎన్నో సేవలు చేస్తున్నారు కోదాడ నియోజకవర్గం చుట్టూ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం అందించటంతో పాటుగా అనేక వైద్య శిబిరాలు,ఉచిత మందుల పంపిణీ వైద్యం లో బరోసా ఇస్తూ వారికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు పెద్దపెద్ద ప్రమాదాల పట్ల వారికి అవగాహన కల్పిస్తూ వారికి వైద్య సహకారం అందించి ప్రాణాలు నిలబెట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి గొప్ప మనసు గల డాక్టర్లకు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది అని డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీపతి రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి తల సేమియా కిడ్నీలో రాళ్లు తొలగించుట ప్రోస్టేట్ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా చేయబడునని వారు తెలిపారు.అనంతరం స్టాప్ డాక్టర్లను బొకే శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రసాద్ రెడ్డి,డాక్టర్ ప్రమీల,డాక్టర్ అన్సారి అబ్దుల్లా,డాక్టర్ విజయలక్ష్మి,డాక్టర్ సిద్ధార్థ,డాక్టర్ సందీప్,లక్ష్మి,తిరుమల స్టాప్ కస్తూరి,రఘురాం,భాష,వీర కుమారి,కొండలు,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
శ్రీ తిరుమల హాస్పిటల్ లో జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఆత్మీయ సన్మానం
RELATED ARTICLES