కోదాడ,జులై 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:యువనేత,తెలంగాణ భవిష్యత్తు,బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కొమర బండ లో టిఆర్ఎస్వి టౌన్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి అఖిల్ ఉపాధ్యక్షులు సిద్దు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు మరియు పెన్సిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ నాయకులు మామిడి రామారావు నోట్ బుక్స్,పెన్నులు,పెన్సిల్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని,ఎందరో యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన కేటీఆర్ స్ఫూర్తితో యువకులు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మామిడి రామారావు కోరారు.ఈకార్యక్రమంలో దేవపంగు దనముర్తి,హెడ్ మాస్టర్ రామారావు,ఉపాధ్యాయిని ఉపాద్యాయులు,వెంకటేష్,రెడ్డి బోయిన గోపి,గొల్లపల్లి అఖిల్,సిద్దు,చరణ్,చారి,దాసరి అఖిల్,భాను, గోపి,సతీష్,రవి,సాయి, అసిఫ్,అన్వేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.