కోదాడ,జులై 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నూతనంగా కోదాడ రెవిన్యూ డివిజనల్ పరిపాలన అధికారిగా విచ్చేసిన చింతల సూర్యనారాయణని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ మర్యాదపూర్వకంగా కలిసి యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది.ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ గతంలో కల్లూరు లో విధులు నిర్వహించి నూతనంగా కోదాడకు ఆర్డిఓగా వచ్చిన సత్యనారాయణ కి టీఎన్జీవో సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ పివి,టిఎన్జిఎస్ యూనిట్ అధ్యక్షులు కార్యదర్శులు గడ్డం అశోక్,పద్మ,భవాని,రాధిక,సరస్వతి,అనిల్ కుమార్,బాబా,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన ఆర్డిఓ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్
RELATED ARTICLES