కోదాడ,జులై 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మునగాల మండల ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉద్యమిస్తాం మండలంలోని రామసముద్రం గ్రామంలో బేడా బుడగజంగాలు గత 40 సంవత్సరాలుగా జీవనం ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏరకంగా ఆదుకోలేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు. శనివారం 11వ రోజు మన ఊరుకు మన గడపకు మన అంజన్న కార్యక్రమంలో భాగంగా మునగాల మండలంలోని రామసముద్రం,కలకోవ,మాధవరం,నేలమర్రి,వెంకట్రాంపురం,తాడవాయి గ్రామాలలో పర్యటించిన డాక్టర్ అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ రామసముద్రం గ్రామంలో దాదాపుగా బేడ బుడిగ జంగాల కుటుంబాలు 200 వరకు ఉన్నాయని 40 సంవత్సరాలుగా వారు తాటాకుల గుడిసెల్లోనే జీవనం గడుపుతున్నారని వర్షాకాలంలో వారి గుడిసెల్లోకి నీరు వెళ్లడం వల్ల పాములు తేళ్లు కరుస్తున్నాయని మాకు ఇళ్లను ఇచ్చి మమ్మలను ఆదుకోవాలని వారు మొరపెట్టుకుంటున్నారని అంజి యాదవ్ అన్నారు.ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో తమ కష్టాలను చెప్పుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారని కేవలం రాజకీయ నాయకులు ఎలక్షన్ సమయంలో మాత్రమే తమను కలుస్తారని తరువాత తమకు ఏ సమస్య వచ్చినా పట్టించుకోరని సమస్య గురించి అడిగితే బెదిరిస్తున్నారని అన్నారు.మాకు కష్టాల్లో అండగా నిలబడే వాళ్ళని పార్టీతో సంబంధం లేకుండా ఓట్లేసి గెలిపించుకుంటామని అంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ పేరుతో ఈ కులాలను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న ఈ ఎంబీసీ కులాలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.ఈ నియోజకవర్గంలో పాతతరం నాయకులకు కాలం చెల్లిందని నూతన తరం యువకుల నాయకత్వం ఎంతైనా అవసరం ఉందని చెప్పుకుంటున్నారని అంజి యాదవ్ అన్నారు..ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,నవీన్,కతిమాల వెంకన్న, మాలోవత్ బాలు,బండి గోపి,జగ్య, బాణావత్ రాజా,సాయి,సంతోష్ ,గోపి,చిన్న బుజ్జి,స్రవంతి,బాలి లక్ష్మి,సునీత,రమణి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.
మునగాల మండలంప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉద్యమిస్తా:బేడ బుడిగజంగాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి:Dr అంజి యాదవ్
RELATED ARTICLES