కోదాడ,జులై 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సమాజంలోని యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిఎస్పి బి ప్రకాష్ అన్నారు.శనివారం పట్టణానికి చెందిన వాసవి యూత్ క్లబ్ సభ్యులు డిఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలన్నారు సమాజంలోని రుగ్మతలను మూఢనమ్మకాలను పారదోలెందుకు కృషి చేయాలన్నారు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలన్నారు ఈ సందర్భంగా డిఎస్పీని యూత్ సభ్యులు బొకేలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇమ్మడి అనంత చక్రవర్తి,ఓరుగంటి నిఖిల్,డాక్టర్ వంగవీటి భరత్ చంద్ర,సాయి,సంపత్,మేఘనాథ్,గుడిగుంట్ల నాగ అఖిల్ పాల్గొన్నారు
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
RELATED ARTICLES