కోదాడ,ఆగష్టు 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నుండి మిగులు భూములను దోచుకోవడానికి ధరణి పోర్టల్ అనే స్కీముని తీసుకొచ్చిందని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు. ఆదివారం మన ఊరుకు మన గడపకు మన అంజన్న అనే కార్యక్రమంలో భాగంగా చిలుకూరు మండల పరిధిలోని జెర్రిపోతుల గూడెం ఆచర్లగూడెం,చెన్నారి గూడెం, బేతవోలు గ్రామాలలో పర్యటించిన డాక్టర్ అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వన్ స్ట్రోక్ వన్ కరప్షన్ వన్ ఫ్యామిలీ గా మిగిలిందని అన్నారు.తెలంగాణలో ఉన్న భూములు అన్ని ప్రొహిబిటెడ్ కేటగిరి లో పెట్టి కేసీఆర్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అని అన్నారు.భూముల మీద సర్వహక్కులు కేసీఆర్ కే ఉండాలని వీఆర్వో వ్యవస్థను తీసేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.

ధరణి పోర్టల్ అనేది స్కీం కాదు ఒక స్కాం అని అన్నారు.గ్రామాలలో పేద ప్రజలు సాదాబైనామాల మీదనే భూమి క్రయ విక్రయాలు జరపటం తెలంగాణలో ఆనవాయితీ.ఈ సాదా బైనమాలకు అమ్మినవారు, కొన్నవారు కట్టుబడి ఉంటారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో ఈ అగ్రిమెంట్లపై కొన్న భూములు ఉండే అవకాశం లేదు ప్రభుత్వం ధరణిలో లేని భూములను స్వాధీనం చేసుకోవడం అంటే రైతుల యొక్క భూములను గుజ్జుకోవడమే అని అన్నారు.ఈ ధరణి పోర్టల్ వలన రెవెన్యూ సమస్యలకు భూ తగాదాలకు దారితీస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు వ్యతిరేకంగా ఉందని ధరణిపై పెద్ద ఎత్తున రైతు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు.ధరణి ద్వారా మిగిలిన భూములను ముఖ్యమంత్రి కుటుంబం వేల ఎకరాలు కబ్జా చేయడానికి తీసుకొచ్చిన స్కీమే ధరణి పోర్టల్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,మట్టయ్య యాదవ్,రవి,కోటయ్య,రాముడు,శివ,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,జానకి రాములు, శంకర్,నవీన్,కతిమాల వెంకన్న,చంద్రకళ,గౌతమి,కళావతి మాలోవత్ బాలు,అయ్యప్ప, అప్పారావు,ఎలుగూరి సైదులు గౌడ్ బాణావత్ రాజా,సాయి,సంతోష్ ,గోపి,చిన్న బుజ్జి,స్రవంతి,బాలి లక్ష్మి,సునీత,రమణి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.