కోదాడ,ఆగష్టు 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండల కేంద్రంలో గల బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి నాకు న్యాయం జరగకపోతే ఇక్కడి నుంచి దూకుతా అంటున్న సంఘటన నడిగూడెం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నడిగూడెం మండల కేంద్రానికి చెందిన దున్న నాగరాజు కి 1:20 కుంటల భూమి కలదు ఈ భూమికి గతంలో పాస్ బుక్స్ ఉన్నాయి ఈ భూమిని వాళ్లు సాగు చేయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు కానీ నూతన పాస్ బుక్స్ ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు అలసత్వం ఊహిస్తున్నారని, పొలం చేసుకోవద్దని నన్ను ఇబ్బందులు పెడుతున్నారని మండల కేంద్రంలో గల ప్రభుత్వ సెల్ టవర్ ఎక్కి న్యాయం జరిగే వరకు కిందికి దిగను న్యాయం జరగకపోతే ఎక్కడి నుంచి దూకుతానని అంటున్నాడు
నాకు న్యాయం జరగకపోతే సెల్ టవర్ మీద నుంచి దూకుతా అని అంటున్న రైతు
RELATED ARTICLES



