కోదాడ,ఆగష్టు 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో కోదాడ నియోజకవర్గం నుంచి మరోసారి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు యాదవ సంఘం నాయకులు బిఆర్ఎస్ పార్టీ ఒకటో వార్డు యూత్ కార్యదర్శి పుట్టపాక సురేష్ యాదవ్ తెలిపారు కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రజా నేత బలహీన వర్గాల నాయకుడు బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వంలో కోదాడ మరింత అభివృద్ధి చెందుతుందని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో మల్లయ్య యాదవ్ అఖండ విజయాన్ని సాధించే విధంగా పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు
కోదాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రకటించడం పట్ల హర్షం:కార్యదర్శి పుట్టపాక సురేష్ యాదవ్
RELATED ARTICLES



